కూటమి ఏది.. జన సైనికులను చితక్కొట్టారు: అంబటి | YSRCP Ambati Rambabu Satirical Comments On Janasena And TDP | Sakshi
Sakshi News home page

కూటమి ఏది.. జన సైనికులను చితక్కొట్టారు: అంబటి

Oct 24 2026 12:00 PM | Updated on Oct 24 2026 12:38 PM

YSRCP Ambati Rambabu Satirical Comments On Janasena And TDP

సాక్షి, గుంటూరు: ఎస్‌ఈసీ న్యాయం, ధర్మంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హింసను రాజేస్తూ ఎన్నికలు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. మాజీ మంత్రి విడదల రజినీ మీద పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు? అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు వ్యవస్థ దారుణంగా దిగజారిపోయింది. స్థానిక ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఎస్‌ఈసీ టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ ఎలా ముగిసిందో అందరూ చూశారు. నామినేషన్ వేయడానికి వీలులేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నామినేషన్ కేంద్రాల్లో పోలీసులు, తెలుగుదేశం నాయకులు కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుల నామినేషన్ పత్రాలు లాక్కొని, కొడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగకపోతే చంద్రబాబు విఫలం అయినట్టే.

ఇన్ని అరాచకాలు చేసి ఏం పీక్కుతింటావ్‌ చంద్రబాబు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూటమి ఘోరంగా ఓడిపోతుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించకపోతే కూటమి ఘోరంగా ఓడినట్టే. మా కత్తికి తిరుగేలేదు, మా పోలీసుల లాఠీకి ఎదురేలేదు అన్నట్టుగా ఉంది. కూటమి పార్టీలు బీజేపీ, జనసేన అభ్యర్థులను కూడా కొడుతున్నారు. ఏపీలో అరాచకాల మీద మీడియా ప్రశ్నించాలి. చంద్రబాబు గురించి పవన్‌ కల్యాణ్‌కు సరిగా తెలియడం లేదు. చంద్రబాబు, లోకేష్‌లను మోసే జనసేన వాళ్లను కూడా చితక్కొడుతున్నారు. భస్మాసుర హస్తాన్ని జనసేన నెత్తిన పెట్టుకుంది. పోలీసులు, ఎస్‌ఈసీ, టీడీపీ గూండాలు కలిసి దుర్మార్గాలు చేస్తున్నారు. టీడీపీ గూండాలు ఆడవాళ్ల చీరలు లాగుతున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ దీని పర్యావసానాలు తప్పకుండా అనుభవిస్తారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం చంద్రబాబుకు లేదు. మీడియాను నామినేషన్ కేంద్రాల వద్దకు రాకుండా ఎందుకు ఆపుతున్నారు. అక్రమ అరెస్టులతో గెలిస్తే ఆది గెలుపే కాదు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ల్నాడులో జరుగుతోన్న దౌర్జన్యకాండను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేయండి. వైఎస్సార్‌సీపీ గుంటూరు మేయర్‌ అభ్యర్థి శ్రీదేవికి గుంటూరు ఓటర్లు ఓటు వేయాలి’ అని ఓటర్లు కోరారు.

ఇదీ చదవండి: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement