వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి బదిలీ

YS Viveka murder case investigating officer transferred - Sakshi

కడప అర్బన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి సుధాసింగ్‌ బదిలీ అయ్యారు. ఈ నెల 24న ఆమె విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఆమె స్థానంలో రామ్‌కుమార్‌ అనే ఎస్పీ స్థాయి అధికారి నియమితులయ్యారు.

ఆదివారం కడపకు వచ్చిన ఆయన కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివేకా హత్య కేసులో మరికొంతమందిని సీబీఐ అధికారుల బృందం సోమవారం నుంచి విచారించనుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top