నేడు, రేపు వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ పర్యటన | YS Jagan will be in Pulivendula from July 6 to July 8 | Sakshi
Sakshi News home page

నేడు, రేపు వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ పర్యటన

Jul 7 2026 5:55 AM | Updated on Jul 7 2026 5:55 AM

YS Jagan will be in Pulivendula from July 6 to July 8

నేడు పులివెందులలో ప్రజాదర్బార్‌ 

రేపు ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు 

సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించను­న్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్‌ జగన్‌ పులివెందుల చేరుకుంటారు. భాకరాపురం క్యాంప్‌ కా­ర్యా­లయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.

రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 8న బుధవారం ఉద­యం పులివెందుల నుంచి బయ­లు­దేరి ఉద­యం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement