నేడు భగవాన్‌ మహవీర్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Tributes To Bhagwan Mahavir | Sakshi
Sakshi News home page

నేడు భగవాన్‌ మహవీర్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు

Apr 10 2025 11:42 AM | Updated on Apr 10 2025 12:53 PM

YS Jagan Tributes To Bhagwan Mahavir

సాక్షి, తాడేపల్లి: నేడు భగవాన్‌ మహావీర్‌ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భగవాన్‌ మహావీర్‌ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు.

ఈ క్రమంలో వైఎస్‌ జగన​ ట్విట్టర్‌ వేదికగా..‘జైనుల ఆరాధ్య దైవం, మహావీరుడు ప్రభోదించిన పంచమహా వ్రతాలు, నైతిక జీవనానికి మార్గదర్శకాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి, జైన్‌ వెల్ఫేర్ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ మనోజ్‌ కొఠారి, జైన్‌ సమాజ్‌ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముతా, జైన్‌ సమాజ్‌ సెక్రటరీ పన్నాలాల్‌ జీ, జైన్‌ సమాజ్‌ కమిటీ మెంబర్‌ విక్రమ్‌ బండారి, జైన్‌ సమాజ్‌ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌లాల్‌ కొఠారి పాల్గొన్నారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement