breaking news
Mahavir
-
నేడు భగవాన్ మహవీర్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు భగవాన్ మహావీర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు.ఈ క్రమంలో వైఎస్ జగన ట్విట్టర్ వేదికగా..‘జైనుల ఆరాధ్య దైవం, మహావీరుడు ప్రభోదించిన పంచమహా వ్రతాలు, నైతిక జీవనానికి మార్గదర్శకాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జైనుల ఆరాధ్య దైవం, మహావీరుడు ప్రభోదించిన పంచమహా వ్రతాలు, నైతిక జీవనానికి మార్గదర్శకాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు#MahavirJayanti pic.twitter.com/h4H0IhH9Ay— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముతా, జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్ జీ, జైన్ సమాజ్ కమిటీ మెంబర్ విక్రమ్ బండారి, జైన్ సమాజ్ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌లాల్ కొఠారి పాల్గొన్నారు. 10.04.2025తాడేపల్లివైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ @ysjaganఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ… pic.twitter.com/VCgMzJFxJc— YSR Congress Party (@YSRCParty) April 10, 2025 -
Mahavir Jayanti: 10 బోధనలు.. ప్రశాంతతకు సోపానాలు
నేడు (ఏప్రిల్ 10) జైన మత స్థాపకుడు భగవాన్ మహావీర్ జయంతి. శ్రీమంత క్షత్రియ కుటుంబంలో క్రీ.పూ. 599లో బీహార్‌లోని కుండగ్రామంలో మహావీర్ జన్మించారు. ఆయన తండ్రి రాజు సిద్ధార్థ, తల్లి రాణి త్రిశల. చిన్న వయస్సు నుండే వర్థమాన్లో ఆధ్యాత్మిక ఆలోచనలు, జీవుల పట్ల కరుణ తొణికిసలాడేది. తన 30 ఏళ్ల వయసులో వర్థమాన్ గృహస్థ జీవితాన్ని త్యజించి, సన్యాస జీవనం స్వీకరించారు. 12 ఏళ్ల కఠిన తపస్సు, ధ్యానం తర్వాత ఆయనకు శుద్ధ జ్ఞానం ప్రాప్తించించదని చెబుతారు.భగవాన్ మహావీర్.. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచవ్రతాలను బోధించారు. ఆయన బోధనలు జీవులన్నింటనీ సమానంగా గౌరవించడం, శాంతియుత జీవనాన్ని గడపడం లాంటి సూత్రాలపై ఆధారపడ్డాయి. మహావీర్ తన జీవితమంతా పలు ప్రాంతాలలో పర్యటించి జైనమత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. క్రీ.పూ. 527లో 72 ఏళ్ల వయసులో, బీహార్‌లోని పావాపురిలో భగవాన్ మహావీర్ నిర్వాణం పొందారు. మహావీర్ బోధనలు ఈ రోజుకు కూడా అందరినీ శాంతి, అహింసల దిశగా ప్రేరేపిస్తున్నాయి.భగవాన్ మహావీర్ 10 బోధనలు1. అహింస: ఏ జీవికీ హాని చేయకుండా జీవించడం అత్యంత ఉన్నతమైన ధర్మం.2. సత్యం: ఎల్లప్పుడూ నిజం మాట్లాడటం, నీతి నిజాయితీతో జీవనం సాగించడం.3. అస్తేయం: ఇతరుల వస్తువులను దొంగిలించకుండా, వారి అనుమతి లేనిదే తీసుకోకుండా ఉండటం.4. బ్రహ్మచర్యం: శారీరక, మానసిక కోరికలను నియంత్రించి, స్వచ్ఛమైన జీవనం గడపడం.5. అపరిగ్రహం: అవసరానికి మించిన సంపద, ఆస్తులపై ఆసక్తి వదిలి సాధారణ జీవనం గడపడం.6. కరుణ: అన్ని జీవుల విషయంలో దయ, సానుభూతి చూపడం.7. క్షమ: ఇతరుల తప్పులను క్షమించడం, కోపాన్ని అధిగమించడం.8. సమత్వం: సుఖంలోనూ, దుఃఖంలోనూ సమ భావనతో ఉండటం.9. ఆత్మ శుద్ధి: మనసు, మాట, చేతలతో మనలోని పవిత్రతను కాపాడుకోవడం.10. ధ్యానం: ఆత్మ సాక్షాత్కారం కోసం ధ్యానం అవలంబించడం. పవిత్ర ఆలోచనలను పెంపొందించుకోవడం.ఇది కూడా చదవండి: వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది? -
కురుక్షేత్ర సంగ్రామం
రణరంగంలోకి దూకి శత్రువులపై విల్లు ఎక్కుపెట్టి వీరోచితంగా పోరాడుతున్నారు విక్రమ్. మలయాళ దర్శకుడు ఆర్ఎస్. విమల్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘మహావీర్‌కర్ణ’ అనే మల్టీలింగ్వల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహాభారతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కర్ణుడి దృష్టికోణంలో సాగేలా కథను రెడీ చేశారట విమల్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదాబారాద్‌లో ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌ను 18 రోజుల పాటు ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. అదే టైమ్‌లో సినిమాలో భాగమైన ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారట. -
రాయచూరులో భారీ వర్షం
రాయచూరు సిటీ, న్యూస్‌లైన్ : రాయచూరు నగరంలో వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి దాదాపు 3 గంటల సేపు కురిసిన భారీ వర్షానికి రహదారులు, వీధులు జలమయం అయ్యాయి. ఏ వీధిలో చూసినా మోకాలు లోతున నీరు ప్రవహించాయి. మురికి కాలువల్లోని చెత్తా చెదారం రోడ్లపై చేరింది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బంగికుంట, మడ్డిపేట, షియాతలాబ్, అరబ్మౌల, చంద్రకాంత్ టాకీస్, బసవన బావి చౌక్, మున్నూరు వాడి పాఠశాల, ఆస్మియా కాంపౌండ్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవాహాన్ని తలపించింది. మహావీర్ చౌక్‌లో నీరు అధికంగా ప్రవహించడంతో అరగంట సేపు ద్విచక్ర వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి. రోడ్లపై వ ర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. జలమయమైన పలు ప్రాంతాలను గురువారం ఉదయం ఉపాధ్యక్షురాలు పద్మ సందర్శించారు. నగరంలోని బంగికుంట, మహాబలేశ్వర చౌక్, బెస్తవారి పేట, హరిహర రోడ్ తదితర ప్రాంతాల్లో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంలో నగరసభ పారిశుద్ధ్య సిబ్బంది జాప్యం చేయడంపై మండిపడ్డారు. ఆమె వె ంట నగరసభ సభ్యులు జయణ్ణ, శివమూర్తి, శశిరాజు, నరసప్ప, మహబూబ్, మల్లేశప్ప ఉన్నారు.