సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల రానున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతుల పరామర్శతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగన్ బెంగళూరులోని తన నివాసం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి పులివెందుల చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తారు. సుమారు మూడు గంటల పాటు క్యాంపు కార్యాలయంలో పలువురి కలవనున్నారు. ఆ తరువాత స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
బుధవారం ఉదయం పులివెందులలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి హాజరై వధూ వరులను ఆశీర్వదిస్తారు. ఆ తరువాత బ్రాహ్మణ పల్లె ప్రాంతంలో దెబ్బతిన్న అరటితోటలను సందర్శిస్తారు. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. అరటి రైతుల పరామార్శ తరువాత వై.ఎస్.జగన్ లింగాల మాజీ సర్పంచ్ మహేశ్ రెడ్డి కుటుంబాన్ని పులివెందుల్లోని వారి స్వగృహంలో కలుసుకుంటారు. ఇటీవలే మరణించిన మహేశ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామార్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వగృహానికి చేరుకుంటారు. రెండు గంటల పాటు అక్కడే ఉంటారు. అనంతరం వేల్పుల గ్రామంలోని రామలింగా రెడ్డి ఇంటివెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు భాకరాపురంలోని క్యాంపు ఆఫీసుకు ఆ తరువాత ఏడు గంటలకు స్వగృహానికి చేరుకుంటారు. రాత్రి బస చేస్తారు.

గురువారం ఎనిమిది గంటలకు భాకరాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా బెంగళూరులోని జక్కూరుకు ఆ తరువాత యలహంకలోని తన ఇంటికి వెళ్లడంతో ఈ పర్యటన పూర్తవుతుంది.
తాడేపల్లి
రేపటి నుంచి మూడు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన
25.11.2025 షెడ్యూల్
సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస…— YSR Congress Party (@YSRCParty) November 24, 2025


