తాడేపల్లి చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Return From London To Tadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లి చేరుకున్న వైఎస్‌ జగన్‌

Feb 3 2025 9:56 PM | Updated on Feb 3 2025 10:06 PM

YS Jagan Return From London To Tadepalli

తాడేపల్లి :  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను పలువురు మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కలిశారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు అంబటి ారాంబాబు, పేర్నినాని, వెల్లంపల్లి  శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్‌ రుహుల్లా, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌,  మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

నందిగం సురేష్‌కు ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌

కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొంటున్న నందిగం సురేష్‌కు వైఎస్‌ జగన్‌  ధైర్యం చెప్పారు.  నందిగం సురేష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైఎస్‌ జగన్‌..   కూటమి ప్రభుత్వం ఏమైతే అక్రమ కేసులు పెట్టిందో  వాటిని ధైర్యంగా ఎదుర్కొందామన్నారు

కాగా, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్‌ నుంచి వైఎస్‌ జగన్‌ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement