
తాడేపల్లి: ఇటీవల పుత్ర వియోగం కల్గిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి(బాజ్జీ)ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈరోజు(సెప్టెంబర్ 22, సోమవారం) డాక్టర్ బాబ్జీకి ఫోన్ చేసిన వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బాబ్జీ కుమారుడు అంజన్ ఆత్మకు చేకూరాలని వైఎస్ జగన్ కోరుకున్నారు.
డాక్టర్ బాజ్జీ ఏకైక కుమారుడు డాక్టర్ అంజన్ (53) శనివారం గుండెపోటుకు గురై పాలకొల్లులోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంజన్ కి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శనివారం మృతిచెందిన అంజన్ అంత్యక్రియలు.. సోమవారం నిర్వహించారు. అంజన్ కుమారుడు విదేశాల నుంచి భారత్‌కు రావడానికి ఆలస్యమైన కారణంగా అంత్యక్రియలు సైతం ఆలస్యమయ్యాయి.