రతన్‌ టాటాకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute to Ratan Tata On Death Anniversary | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటాకు వైఎస్‌ జగన్‌ నివాళి

Oct 9 2026 1:18 PM | Updated on Oct 9 2026 1:21 PM

YS Jagan Pays Tribute to Ratan Tata On Death Anniversary

సాక్షి, తాడేపల్లి: దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. రతన్‌ టాటా విలువలు, సేవలు, మానవతా దృక్పథం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘వినయం, సేవాభావం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా  జీవితం. భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేసిన మహనీయుడు రతన్ టాటా. 

వ్యాపార విజయాలతో పాటు, సామాజిక సేవకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. రతన్‌ టాటా విలువలు, సేవలు, మానవతా దృక్పథం తరతరాలకు స్ఫూర్తిదాయకం. రతన్ టాటా గారి వర్ధంతి సందర్భంగా ఆయన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు’ అని పోస్టు చేశారు. 

ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement