ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ | SC Setback for Andhra Pradesh Government in BC Reservation Case | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Oct 9 2026 11:21 AM | Updated on Oct 9 2026 11:33 AM

SC Setback for Andhra Pradesh Government in BC Reservation Case

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీసీల రిజర్వేషన్లపై దాఖలు చేసిన  పిటిషన్‌ను శుక్రవారం డిస్మిస్‌ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను(జీవోలను) హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతోపాటు పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ జీఓ 105ను, పురపాలక శాఖ జీఓ 1065ను జారీ చేసింది.

అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వాటిని కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

ఎస్‌ఎల్‌పీ దాఖలు
హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం 2026లో కొత్తగా చేపట్టిన అధ్యయనాన్ని హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ షీల్‌ నాగు ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఉపశమనాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఊరట లభించలేదు.

ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టు

కేవలం సమగ్ర కుటుంబ సర్వేను ఎలా పరిగణలోకి తీసుకుంటాం?

ప్రభుత్వ గణాంకాలు శాస్త్రీయంగా లేవన్న ధర్మాసనం.. 

ఏపీ హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉంది.. పిటిషన్‌ డిస్మిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement