సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో రాజమండ్రి రూరల్‌కు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.


