నాతో నడుస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Emotional Message on YSRCP Formation Day 2025 | Sakshi
Sakshi News home page

నాతో నడుస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు: వైఎస్‌ జగన్‌

Mar 12 2025 11:00 AM | Updated on Mar 12 2025 12:02 PM

YS Jagan Emotional Message on YSRCP Formation Day 2025

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం(YSRCP 15th Formation Day) సందర్భంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారాయన.

‘‘నాన్న‌గారు, దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ఆర్(YSR) గారి ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌మ భుజ‌స్కందాల‌పై మోస్తున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయ‌కులంద‌రికీ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. 

.. నా ఒక్క‌డితో మొద‌లై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో శ‌క్తివంత‌మైన రాజ‌కీయ పార్టీగా ఎదిగిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) 15వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్ర‌జ‌ల‌తోనే ఉంది, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్ల‌లో దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయ‌ని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది.

క్లిక్‌ చేయండి: జనం జెండా.. ఈ చిత్రాలు చూశారా?

.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించ‌డం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్‌గా నిల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువ‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త‌కు ప్ర‌తీక‌గా నిలిచిన పార్టీ ప‌ట్ల‌, నా ప‌ట్ల న‌మ్మ‌కంతో విశ్వాసంతో నాతో న‌డుస్తున్న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు, శ్రేయోభిలాషులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అంటూ ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల చిత్రాలను షేర్‌ చేశారాయన.

ఇదీ చదవండి: 3-4 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే!

Advertisement
 
Advertisement
Advertisement