వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan condoles Death of YV Subbareddy Mother Pitchamma | Sakshi
Sakshi News home page

వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Mar 17 2025 10:58 AM | Updated on Mar 17 2025 1:07 PM

YS Jagan condoles Death of YV Subbareddy Mother Pitchamma

సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement