నీనా–ఇషాన్‌ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సతీమణి వైఎస్ భారతీరెడ్డి
సాక్షి, అమరావతి/బనశంకరి: మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి కుమారుడు ఇషాన్ వివాహ ఎంగేజ్‌మెంట్ వేడుక శుక్రవారం బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు హాజరయ్యారు.
నూతన వధూవరులు నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించి.. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


