
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల ప్రజలకూ ఎంతో అభిమానం. ఈ అభిమానంతోనే జగనన్నని ఒక్కసారైనా నేరుగా చూడాలంటూ ఓ యువకుడు తలంచాడు. అనుకున్న ప్రకారమే ఈనెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తన స్వగ్రామం నుంచి సీఎం జగన్‌ను చూసేందుకు బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడు కాలినడకన సీఎంను చూడ్డానికి వస్తూ మంగళవారం పేరకలపాడు క్రాస్ రోడ్డు వద్ద తారసపడ్డాడు.