తిరుపతి : జిల్లాలోని సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగా ఓ మహిల ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు బిడ్డలు మృతి చెందారు. దాంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
తల్లి పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటానికి కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షనే కారణమయ్యి ఉండవచ్చిన చుట్టుపక్కల వారు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


