అబద్ధాలతో చంద్రబాబు చెట్ట‘పట్టాలు’ | Widespread criticism of Chandrababu Naidus lies | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో చంద్రబాబు చెట్ట‘పట్టాలు’

Oct 2 2026 5:30 AM | Updated on Oct 2 2026 5:30 AM

Widespread criticism of Chandrababu Naidus lies

కొండవాలు షెడ్డు స్థలానికి రూ.కోటి విలువ కట్టిన చంద్రబాబు 

సీఎం చెప్పే అబద్ధాలకు అంతూపొంతూ లేదా? 

పైసా ఖర్చు లేదు.. సెంటు భూమి సేకరించలేదు 

ప్రచారం మాత్రం అదరహో 

60 వేల ఎకరాల విలువ రూ.52 వేల కోట్లని ప్రచారం 

సాక్షి, అమరావతి: కొండలు, కాలువ కట్టలపై కొద్దిపాటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని బతుకీడుస్తున్న పేదవాడి స్థలం విలువ కోటి రూపాయలట. ఇది ఎవరో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ చెప్పిన మాట కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదిక నుంచి చెప్పిన లెక్క. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల మందికి రూ.52 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చామని అదేపనిగా ఊదరగొడుతూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో పట్టా విలువ ఏకంగా రూ.కోటిపైనే. నిజంగా ఆ భూమికి అంత విలువ ఉందా అంటే.. అంత ఉంటే వాళ్లు పేదలు ఎలా అవుతారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. 

అధికారుల లెక్క ఒకటి.. బాబు లెక్క మరొకటి 
విజయవాడలో నిర్వహించిన సభకు నాలుగు రోజుల ముందు అధికారులు విజయవాడ భూ­ముల విలువ రూ.9,800 కోట్లు అని చెప్పారు. ఒక్కో కుటుంబానికి లబ్ధి రూ.40–45 లక్షలని ప్రకటించారు. అదే చాలా ఎక్కువ. ఆ భూమికి అంత విలువ ఎక్కడ ఉంటుందని స్థానికులు ఆశ్చర్యపోయారు. కాగా.. చంద్రబాబు దాన్ని ఇంకా పెంచేసి మైక్‌ చేతికి రాగానే విజయవాడలోని ఆ భూమి విలువ రూ.28,112 కోట్లని చెప్పారు. అధికారు­లది ఒక లెక్క.. చంద్రబాబుది ఒక లెక్క. కానీ వా­స్త­వానికి అక్కడున్న భూముల విలువ కంటే ఒకటి, రెండు రెట్లు ఎక్కువ చేసి అధికారులు చెబితే దానికి మూడు రెట్లు కలిపి చంద్రబాబు లెక్క చెప్పడం గమనార్హం. దీనినిబట్టి చంద్రబాబు దొంగ లెక్కలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ­చ్చు.  

గజం రూ.82 వేలు.. ఏ కొండ మీద? 
సీఎం లెక్క ప్రకారం విజయవాడలో కొండపై స్థలాల్లో గజం ధర రూ.82,700. ఇది నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉండే రేటు. పట్టాలు ఇచ్చింది మాత్రం కొండ ప్రాంతాల్లో, రోడ్డు కూడా లేని గల్లీల్లో ఉన్నవారికి. ప్రభుత్వ విలువ ప్రకారం చూసినా అక్కడ గజం రూ.20 వేలు దాటదు. మరి ఆ రూ.82 వేలు ఏ లెక్క? కేవలం ప్రచార లెక్క.  

ఇచ్చింది కాగితం.. చెప్పింది రూ.కోట్లు 
ఈ పట్టాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది పైసా కూడా లేదు. సేకరించిన భూమి సెంటు కూడా లేదు. పేదలు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లకే ఒక కాగితం ఇచ్చారు. విశాఖలో అయితే గతంలోనే ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు డీడ్లు ఇచ్చి మళ్లీ పట్టాభిషేకం అన్నారు. ఆ కాగితానికే రూ.కోట్ల విలువ కట్టి తానేదో పేదలకు కోట్ల ఆస్తి పంచినట్టు డప్పు కొట్టుకుంటున్నారు.

చెప్పేది కొండంత.. చేసేది గోరంత 
సభలో రూ.కోట్ల లెక్కలు, క్షేత్రస్థాయిలో కాగి­తాలు. మైక్‌ ముందు రూ.52 వేల కోట్లు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు సున్నా. చెప్పే మాటకు, చేసే పనికి, కనిపించే వాస్తవానికి ఎక్కడా పొంతన లేదు. అంకెల గారడీతో పేదలను మభ్యపెట్టడం చంద్రబాబుకు కొత్త కాదని, ఇది ప్రజలను నిలువునా మోసం చేయడమేనని పేదలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement