ఈ ఏడాదీ తిరోగమనంలోనే జీఎస్టీ | GST collections declined in the first six months | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదీ తిరోగమనంలోనే జీఎస్టీ

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

GST collections declined in the first six months

మొదటి ఆరు నెలల్లో 6.79 శాతం తగ్గిన జీఎస్టీ వసూళ్లు

2025 ఏప్రిల్‌– సెప్టెంబర్‌ 6 నెలల కాలంలో రూ.23,570 కోట్లు 

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రూ.21,992 కోట్లకు పతనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. యువతకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతీ లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాక రైతులు కుదేలైపోయారు. కొత్తగా వచ్చిన వ్యాపార సంస్థలు, పరిశ్రమలు లేవు. ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు. వ్యాపారాలు దిగజారిపోతున్నాయి. దీంతో ఏటేటా జీఎస్టీ వసూళ్లు పడిపోతున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన మూడో సంవత్సరం కూడా రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు తిరోగమన దిశలోనే నడుస్తున్నాయి. 

2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 6.79 శాతం మేర క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ ఆరు నెలల కాలానికి రూ.23,570 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాదికి వచ్చేసరికి 6.79 శాతం క్షీణించి 21,992 కోట్లకు పరిమితమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం 12 నెలల్లో కూడా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5.41 శాతం క్షీణించి రూ.44,825 కోట్ల నుంచి రూ.42,397 కోట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు, రాజధాని అమరావతిలో వేల కోట్ల పనులతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందంటూ చంద్రబాబు సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతుంటే జీఎస్టీ గణాంకాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, వేల కోట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ మేరకు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఎందుకు పెరగడం లేదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే... జీఎస్టీతో పాటు పెట్రోలియం, లిక్కర్‌ వ్యాట్, వృత్తి పన్ను అన్నీ కలిపి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం మొదటి ఆరు నెలల కాలంలో 18 శాతం పెరిగి రూ.30,435.98 కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ప్రకటన జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement