టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో భారీ అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో భారీ అగ్ని ప్రమాదం

Published Sun, Feb 4 2024 7:32 AM

West Godavari: Massive Fire Accident Due To Tdp Workers - Sakshi

యలమంచిలి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో శనివారం నిర్వహించిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. కొబ్బరి కాయల్ని నిల్వ ఉంచే కురిడీ కొట్ల సమీపంలో పాదయాత్ర సాగుతుండగా.. టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చారు. కొబ్బరి కొట్ల నిర్వాహకులు తారాజువ్వలు వేయొద్దని వేడుకుంటున్నా టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు.

గాలిలోకి వదిలిన తారాజువ్వల వల్ల ఆర్యపేటలోని కొడవటి వెంకటేశ్వరరావు (కొండయ్య) అనే వ్యాపారికి చెందిన మూడంతస్తుల కొబ్బరి గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో ఉద్ధృతమై గోడౌన్‌లో ఉన్న 10 లక్షల కురిడీ కొబ్బరి కాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

వాటితో పాటు గోడౌన్‌ కూడా దగ్ధమైంది. దగ్ధమైన కొబ్బరి కాయల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, దగ్ధమైన గోడౌన్‌ విలువ మరో రూ.కోటి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

Advertisement
 
Advertisement