వీఎస్‌బీతో డిజిటల్‌ స్కాలర్‌ అవగాహన ఒప్పందం

VSB Enters MOU With Digital Scholar - Sakshi

సాక్షి, అమరావతి : వీఐటీ ఏపీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌.. డిజిటల్‌ స్కాలర్‌తో అవగాహాన ఒప్పందం చేసుకుంది. గురువారం వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. డిజిటల్ స్కాలర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ డిజిటల్ స్కాలర్ అనేది డిజిటల్ మార్కెటింగ్ విద్యను అందించే సంస్థ, డిజిటల్ మార్కెటింగ్ సేవల్లో దిగ్గజమైన ఎకోవీఎమ్‌ఈ అనుబంధ సంస్థ. ఎకోవీఎంఈ బ్యాంకులు, హోటళ్లు, ఉత్పత్తి తయారీ పరిశ్రమలు, విద్యాసంస్థలకు తన డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తోంది. 2019లో మొట్టమొదటిసారిగా సాంప్రదాయ మార్కెటింగ్ కోసం ఖర్చును మించి డిజిటల్ మార్కెటింగ్‌పై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. దీనికి కారణం వినియోగదారులు ఆన్‌లైన్ మాధ్యమాలలో ఎక్కువగా ఉన్నారు. సాంకేతిక పురోగతితో సరైన సమయంలో డిజిటల్ పరికరాల్లో వినియోగదారులను చేరుకోవడానికి ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటివి అవసరమైన మార్కెటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి’’ అని అన్నారు.

అనంతరం వీఐటీ-ఎపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, డీన్ డా ఎస్. జయవేలు మాట్లాడుతూ.. ‘‘ డిజిటల్ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ బీబీఏ ప్రోగ్రాం ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ఈ ప్రోగ్రాం పరిష్కరిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు ఏకకాలంలో అకాడమిక్‌, రియల్‌ టైం నైపుణ్యాలను నేర్చుకోవటం జరుగుతుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత వారికి ధృవీకరణ పత్రం అందించబడుతుంది. బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులు కంటెంట్ మేనేజర్స్, స్ట్రాటజిస్ట్స్, వర్చువల్ రియాలిటీ డెవలపర్స్ అండ్ ఎడిటర్స్, ఎస్‌ఈఓ, ఎసీఈఎమ్‌ స్పెషలిస్ట్స్, యూఎక్స్‌ డిజైనర్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్, డైరెక్టర్స్, ఎనలిస్ట్స్, ఏఐ స్పెషలిస్ట్స్ వంటి ఉద్యోగాలలో ప్రవేశించవచ్చు.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ-ఏపీ  రిజిస్ట్రార్ డా.. సి.ఎల్.వి. శివకుమార్,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top