మడకశిర నుంచి తమిళనాడుకు వెళ్లి..

Volunteer Who Went From Madakasira To Tamil Nadu And Provide Pension - Sakshi

పింఛన్‌ అందజేసిన వలంటీర్‌

మడకశిర రూరల్‌: సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్‌ హరిప్రసాద్‌ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్‌ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది. వివరాల్లోకి వెళితే.. మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ తమిళనాడు రాష్ర్టం మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో మూడు నెలలుగా చికిత్స పొందుతోంది.

ఈ క్రమంలో రెండు నెలలుగా పింఛన్‌ పొందని ఆమె...ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛన్‌ కూడా తీసుకోకపోతే పింఛన్‌ రద్దవుతుంది. దీన్ని గుర్తించిన వలంటీర్‌ హరిప్రసాద్‌ 800 కి.మీ దూరంలోని ఉసిలంపల్లికి వెళ్లి పుంగమ్మకు మూడు నెలల పింఛన్‌ అందించాడు. దీంతో పుంగమ్మ వలంటీర్‌కు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్‌ పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి తమిళనాడు వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
చదవండి:
సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్ 
చంద్రగిరిలో బాబుకు షాక్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top