ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బంది బదలాయింపునకు ఆమోదం
నిధులు, అధికారుల నియామకం, మౌలిక వసతులు, తాత్కాలిక భవనాల అంశాలపై షరతులు
గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టులు సృష్టించొద్దంటూ ఆదేశం
ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు ఊసేలేదు.. జోన్ ఏర్పాటుపై గెజిట్ లేదు
జమ్మూకో న్యాయం.. విశాఖకో న్యాయమా అంటూ రైల్వే వర్గాల పెదవి విరుపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి గతంలో పంపిన నివేదికలో రైల్వే బోర్డు స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారుల సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. జోన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు, అధికారుల నియామకం, మౌలిక వసతులు, తాత్కాలిక భవనాల అంశాలపై కఠిన షరతులు విధించిందని తద్వారా తెలుస్తోంది. దీంతో.. డీపీఅర్ అంతా డొల్లేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరో వైపు.. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఆర్‌ఆర్‌బీ ఏర్పాటుపైనా కేంద్రం స్పందించ లేదు. పైగా.. జోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు గెజిట్ విడుదల చెయ్యక పోవడం.. ఈ ఆంక్షలు చూస్తే జోన్‌కు ఇచ్చిన వరాల కంటే ఆంక్షలపైనే రైల్వే బోర్డు అధికారులు దృష్టి సారించారేమో అన్నట్లుగా ఆ పోస్టు ఉంది. ఇందులో ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బంది బదలాయింపునకు పచ్చజెండా మాత్రమే ఊరట కలిగించే అంశాలు. మిగిలిన అనేక విషయాల్లో నిరాశే మిగిలింది. కాగా, డీపీఆర్‌ను ఆమోదించినట్లు తమకెలాంటి అధికారిక ధృవీకరణ లేఖ అందలేదని వాల్తేరు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
జీఎం పోస్టు తప్ప ఇంకేం వద్దు
జోన్ ప్రధాన కార్యాలయానికి 170 మంది అధికారులు, సిబ్బంది నియామకం అవసరమని డీపీఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే రైల్వే బోర్డు ఇవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. కొత్తగా జీఎం పోస్టు తప్ప మరే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించకూడదని స్పష్టం చేసింది. ఎక్కడ పని చేస్తున్న వారు అక్కడే అన్న విధానంలో సిబ్బందిని విభజించాలని సూచించింది. జోన్ ప్రధాన కార్యాలయంతో పాటు సివిల్ పనులకు తొలుత చెప్పిన రూ.180 కోట్లు కాకుండా అదనంగా మరో రూ.200 కోట్లు కావాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించ లేదు. వైద్యానికి సంబంధించి ఇప్పటికే వాల్తేరులో ఉన్న డివిజనల్ ఆసుపత్రిని వినియోగించుకోవాలని, కొత్త యూనిట్ అవసరం లేదని తేల్చి చెప్పింది.

సరిహద్దుల విషయంలోనూ బోర్డు కఠినంగా వ్యవహరించింది. జోన్‌తో పాటు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) వస్తే.. రైల్వే ఉద్యోగాల్లో స్థానిక యువతకి అవకాశాలు మెరుగుపడతాయని అంతా భావించారు. అయితే, డీపీఆర్‌లో ఎక్కడా ఆర్‌ఆర్‌బీ ఊసే లేకపోవడంతో యువతకు నిరాశ ఎదురైంది. తాత్కాలిక కార్యకలాపాల కోసం అద్దె భవనాల్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచే తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు.. జోన్‌కి సంబంధించిన గెజిట్ జారీలోనూ కేంద్రం ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. జమ్మూ తావి ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు. మే 29న గెజిట్ విడుదల చేశారు. కానీ, విశాఖ జోన్ విషయంలో మాత్రం ఈ వేగం కనిపించడం లేదు.