తొలగిస్తే సహించం.. ఉక్కు కార్మికుల హెచ్చరిక | Visakha Steel Plant Workers Concern | Sakshi
Sakshi News home page

తొలగిస్తే సహించం.. ఉక్కు కార్మికుల హెచ్చరిక

Sep 30 2024 11:37 AM | Updated on Sep 30 2024 12:44 PM

Visakha Steel Plant Workers Concern

విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ బీసీ గేట్‌ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మికులు అంటున్నారు.

నిన్న(ఆదివారం) సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్‌, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.

మరోవైపు, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్‌ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్‌ సేల్‌ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: ‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు

దీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement