సీఎం జగన్‌కు శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వానం

Published Mon, Feb 5 2024 5:49 PM

Visakha Sarada Peetam Invites CM YS Jagan For Annual Celebrations - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేశారు.

Advertisement
 
Advertisement