Best Police Station‌: ఏపీలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

Best Police Station‌: ఏపీలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ ఇదే..

Published Sat, May 14 2022 7:55 AM

Valetivaripalem Police Station Best Police Station In AP - Sakshi

ఒంగోలు(ప్రకాశం జిల్లా): రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసుస్టేషన్‌గా వలేటివారిపాలెం పోలీసుస్టేషన్‌ (ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఏటా కొన్ని పరిమితుల ఆధారంగా దేశంలో టాప్‌ 10లో ఉన్న పోలీసుస్టేషన్లను ఎంపిక చేస్తుంది.
చదవండి: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే..

అందులో భాగంగా చుండి (వలేటివారిపాలెం) పోలీసుస్టేషన్‌ 2021 సంవత్సరానికి రాష్ట్రంలోనే నంబర్‌ 1స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం శాఖ సెక్రటరీ సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని జారీ చేశారు. ఎస్పీ మలికాగర్గ్‌ మాట్లాడుతూ.. ఉత్తమ పోలీసుస్టేషన్‌గా వలేటివారిపాలెం పోలీసు స్టేషన్‌ నిలవడం గర్వకారణమన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement