ఆ విషయంలో బాబు కాంప్రమైజ్‌ అయ్యారు..

Undavalli Arun Kumar Comments Over Polavaram Project - Sakshi

చట్టం గొప్పదా.. బాబు, మోదీల ఒప్పందం గొప్పదా..

సాక్షి, తూర్పు గోదావరి : గతంలో పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని, రిజర్వాయరు కట్టడానికి అవకాశం ఉన్న ప్రాంతం పోలవరం ఒక్కటేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రిజర్వాయరు లేకుండా ప్రాజెక్టే లేదన్నారు. స్థానికులకు పునరావాసం కల్పించాలని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం అంశం చట్టంలో ఉన్నా, చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని,  స్పెషల్ ప్యాకేజి పేరుతో సరిపెట్టుకున్నారని తెలిపారు. పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా, మోదీ- చంద్రబాబు చేసుకున్న ఒప్పందం గొప్పదా అని ప్రశ్నించారు. పోలవరానికి ఇవ్వాల్సిన ఖర్చు వందకు వందశాతం భరిస్తామని కేంద్రం చట్టంలోనే తెలిపిందన్నారు. లోక్ సభలో లైవ్ టెలికాస్టు ఆపడం కూడా లోక్ సభ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలోనే చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా సీఎం చూసుకోవాలన్నారు.

‘‘అప్పట్లో ఇచ్చిన హామీలను కూడా ఇప్పుడు కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదు. పోలవరం కూడా పక్కన పెట్టే ప్రయత్నంచేస్తున్నారు. పోలవరం ప్రాజక్టు అథారిటీ ఆధ్వర్యంలోనే ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉంది. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని బైపాస్ చేయలేరు. 2017లో  కేవీపీ రామచంద్ర రావు కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాం. లోక్ సభలో చర్చకు  నోటీసివ్వమని చంద్రబాబుకు గతంలో గంటన్నర పాటు చెప్పాను. అయినా పట్టించుకోలేదు. పార్లమెంట్లో వెంకయ్యనాయుడు అడిగిన పదివేల కోట్లు కూడా కేంద్రం ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఇవ్వలేదు. రాయలసీమను, ఆంధ్రా ప్రాంతాన్ని డెవలెప్ చేస్తామని కేంద్రం ఆనాడు చెప్పింది. ( ఆ ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లింది: కాకాణి )

ఇప్పటివరకూ జరగలేదు. జూన్ 24, 2019 కేంద్ర మంత్రి రతన్ లాల్ కఠారియాకు, చంద్రబాబు ప్రభుత్వం పంపిన 57,218 కోట్ల రూపాయల పోలవరం వ్యయ  ప్రతిపాదనల్లో  1748 కోట్లు తగ్గించి ఆమోదించారు. చట్టం అమలు జరిగేటట్టు కూడా చూడాలి. పోలవరానికి 35 వేల కోట్ల రూపాయలు మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి. కేవీపీ వేసిన పిటిషన్‌లో ఇంప్లీడ్ పిటిషన్ నేను ఫైల్ చేస్తాను. ఆర్గుమెంట్ నేనే చేస్తాను. పట్టిసీమ మీద పెట్టిన ఖర్చు పోలవరంపై ఖర్చు పెడితే ఈ పాటికి పోలవరం ఆనకట్ట పూర్తయ్యేది. గ్రావిటీ మీద నీరు పంపించే అవకాశం ఉండేది’’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top