వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్ల ప్రక్రియ..

Transparently Inter First Year Admissions Process - Sakshi

ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్‌ అడ్మిషన్లు

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై.. అధికారులతో సమావేశం నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో నిబంధన ప్రకారమే అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ)

ఆన్‌లైన్‌లోనే ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని.. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. ‘‘ప్రైవేట్‌ కాలేజీలు అడ్మిషన్లపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్‌ అడ్మిషన్లు. ఈ నెల 18 నుంచి ఇంటర్‌ తరగతులు. కాలేజీల్లో కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. యథావిధిగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తామని’’ మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top