చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య | Tragic incident in Konaseema district | Sakshi
Sakshi News home page

చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

Oct 16 2025 5:44 AM | Updated on Oct 16 2025 5:44 AM

Tragic incident in Konaseema district

కోనసీమ జిల్లాలో విషాద ఘటన 

బంధువులే కారణమంటూ సెల్ఫీ వీడియో

ఆలమూరు: కుటుంబ కలహాలు, బంధువుల వేధింపులతో కన్న పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావు­లూ­రి కామరాజు అలియాస్‌ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్‌ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్‌ (11),  గౌతమ్‌ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసు­కుని బలవన్మరణానికి పాల్ప­డ్డాడు. స్థాని­కుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు న­మోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావు­లూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొ­న్నాడు. 

ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement