Tragedy In Balliparru Village Due To The Death Of Chalapathi Rao - Sakshi
Sakshi News home page

చలపతిరావు మృతితో బల్లిపర్రులో విషాదం

Dec 26 2022 3:46 AM | Updated on Dec 26 2022 8:32 AM

Tragedy in Balliparru due to death of Chalapathi Rao - Sakshi

బల్లిపర్రులో చలపతిరావు నిర్మించిన ఇల్లు

బల్లిపర్రు (పామర్రు) : ప్రముఖ సినీనటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) మృతి ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతిపట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని, మంచి మిత్రుణ్ణి కోల్పోయామని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో తనకున్న స్థలంలో ఒక చిన్న ఇల్లుని నిర్మించారని దానిని తన సోదరి అయిన భ్రమరాంబకు ఇచ్చారన్నారు.

ఏటా గ్రామానికి వచ్చి స్థానికులు, బంధువులతో ఆయన ముచ్చటించే వారని, గ్రామంలో ఉన్న 1.40 ఎకరాల పొలాన్ని చలపతిరావే సాగు చేస్తుండేవారని వారు తెలిపారు. స్థానిక గంగానమ్మ ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందజేశారని వారు గుర్తుచేశారు. అత్తవారి ఇల్లు కూడా పామర్రు మండల పరిధిలోని జమీగొల్వేపల్లి గ్రామం కావడంతో అక్కడి వారితో కూడా సత్సంబంధాలున్నాయని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement