వాహనదారులకు అలర్ట్‌.. ఆ రూట్‌లో 9న ట్రాఫిక్‌ మళ్లింపు

Traffic diversion on 9th July for YSRCP Plenary 2022 - Sakshi

ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలు: డీజీపీ 

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకాని వద్ద జాతీయ రహదారి – 16 సమీపంలో జరిగే వైఎస్సార్‌సీపీ ప్లీనరీ, బహిరంగ సభ సందర్భంగా ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని భారీ వాహనాలతో పాటు ఇతర ట్రాఫిక్‌ ప్లీనరీ జరిగే జాతీయ రహదారిపైకి రాకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్టు చెప్పారు. ఈ నిబంధనలు శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.  

► చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపు వెళ్లే భారీ గూడ్స్‌ వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల–బాపట్ల–రేపల్లె– అవనిగడ్డ– పామర్రు– గుడివాడ– హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు.  
► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు క్రాస్‌ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్‌ మీదుగా అవనిగడ్డ, పామర్రు– గుడివాడ– హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.  
► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుడివాడ– పామర్రు– అవనిగడ్డ– రేపల్లె– బాపట్ల– చీరాల– త్రోవగుంట– ఒంగోలు మీదుగా మళ్లించారు.  
► విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు– మైలవరం– జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. 
► హైదరాబాద్‌ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు – మైలవరం– నూజివీడు– హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు. 
► చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే మల్టీ యాక్సిల్‌ గూడ్స్‌ వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారికి సమీపంలోని చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. 
► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్‌ గూడ్స్‌ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ వద్ద, పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. 

ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ ఇలా.. 
► విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు కాజా టోల్‌ ప్లాజా వద్ద ఉన్న ఆర్కే వెనుజియా లేఅవుట్‌ వద్ద, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. 
► గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు నంబూరు, కంతేరు రోడ్డుపైన, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్‌ ట్రీ అపార్ట్‌మెంట్స్‌ పక్కన పార్కింగ్‌ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top