తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటలు సమయం.. | Tirumala TTD Latest News Updates On November 23 2024 | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటలు సమయం..

Nov 23 2024 8:57 AM | Updated on Nov 23 2024 11:56 AM

Tirumala TTD Latest News Updates On November 23 2024

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 16  కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,731 మంది స్వామిని దర్శించుకోగా 22,890 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమరి్పంచారు. 

దర్శన టికెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement