TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ | Tirumala TTD Latest News Updates On November 18 2024 | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ

Nov 18 2024 8:00 AM | Updated on Nov 18 2024 8:03 AM

Tirumala TTD Latest News Updates On November 18 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న (ఆదివారం) 71,441 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,595 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement