TTD: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On July 17 2024 | Sakshi
Sakshi News home page

TTD: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Jul 17 2024 9:56 AM | Updated on Jul 17 2024 11:29 AM

Tirumala TTD Latest News Updates On July 17 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4  గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(మంగళవారం) 71,409 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.15 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement