Samajika Nyaya Bheri: Third Day YSRCP Samajika Bhari Bus Yatra Started Details Inside - Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయభేరి: మూడో రోజు బస్సు యాత్ర

May 28 2022 9:57 AM | Updated on May 28 2022 1:56 PM

Third Day Ysrcp Samajika Bhari Bus Yatra Started - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయభేరిలో భాగంగా మూడోరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నేడు తాడేపల్లిగూడెం నుంచి నర్సారావుపేటకు బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్ర సందర్భంగా  స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద వైఎస్సార్ , ఇతర నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం జరుగుతోంది. కేబినెట్‌లో 17 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. మేమంతా సీఎం జగన్‌ తయారు చేసిన సైనికులం’’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎవరూ సామాజిక న్యాయం పాటించలేదు. సీఎం జగన్‌ ఒక్కరే సామాజిక న్యాయం పాటించారు’’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే.. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement