
ఏపీలో వర్షాలు అప్‌డేట్స్..
కోనసీమ జిల్లాను ముంచెత్తిన వరద..
- కోనసీమ-పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
- ఇప్పటికే రెండు సార్లు నీటి మునిగిన కాజ్‌వేలు
- కోనసీమ జిల్లాను ముంచెత్తిన వరద.
- పొంగిపొర్లుతున్న వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ద గౌతమి నదులు.
- అప్పనపల్లి కాజ్‌వేపైకి చేరిన వరద నీరు.
- పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్‌వేపైకి వరద నీరు.

అల్లూరి సీతారామరాజు జిల్లా..
- తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న గోదావరి, శబరి నదుల ఉధృతి.
- భయాందోళనలో విలీన మండలాల వాసులు...
- కూనవరం మండలం, పోలిపాక వద్ద భద్రాచలం-కూనవరం ప్రధాన రహదారిపై చేరిన వరదనీరు..
- ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం...
- కూనవరంలో శబరి-గోదావరి సంగమం వద్ద 41 అడుగులకు చేరుకున్న వరద ఉధృతి
- కొండ్రాజుపేట కాజ్ వేపై కొనసాగుతున్న వరద ప్రవాహం..
- పలు గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
- లోతట్టు ప్రాంతాల్లో రహదారులను ఆనుకొని ప్రవహిస్తున్న వరదనీరు..
- చింతూరు వద్ద 30.5 అడుగులు ఉన్న వరద నీటిమట్టం
- ముకునూరు వద్ద వీఆర్‌పురం-చింతూరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న సోకిలేరు వాగు..
- రెండు మండలాల్లో సుమారు 45 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
- నాలుగు మండలాల్లో సుమారు 80 పైగా గ్రామాలకు రాకపోకలు బంద్
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగుల నీటిమట్టం
- కూనవరం వద్ద నీటిమట్టం 18.10 మీటర్లు
- పోలవరం వద్ద 11.71 మీటర్లు
- ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 7.99లక్షల క్యూసెక్కులు
- ఇవాళ మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం
- సహాయక చర్యలకు ఆరు SDRF బృందాలు
- నిలకడగా కృష్ణానది వరద ప్రవాహం
- ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కలు
- వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- కృష్ణా, గోదావరి నది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు
- -ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.