సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు | Tenders for MEP works in Secretariat High Court and Assembly buildings | Sakshi
Sakshi News home page

సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు

Apr 18 2026 5:39 AM | Updated on Apr 18 2026 5:39 AM

Tenders for MEP works in Secretariat High Court and Assembly buildings

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏజీఐసీఎల్‌ 

బిడ్‌ల దాఖలుకు జాయింట్‌ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన 

పనులు ఎవరికి దక్కుతాయన్నది ఇప్పటికే నిర్ణయమైపోయిందంటోన్న నిపుణులు 

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం టవర్లలో ఎంఈపీ(మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌) పనులకు మూడు ప్యాకేజీల కింద అమరావతి గ్రోత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏజీఐసీఎల్‌) టెండర్లు పిలిచింది. బీ+జీ+39 అంతస్తులతో నిరి్మస్తున్న 1, 2 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.743.02 కోట్లు.. 2, 3 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.681.47 కోట్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం  బీ+జీ+49 అంతస్తులతో నిరి్మస్తున్న జీఏడీ టవర్‌లో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.431.59 కోట్లుగా నిర్ణయించింది. 

ఇక ఏడు అంతస్తుల(బీ+జీ+7)తో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.365.15 కోట్లు.. మూడు అంతస్తులతో(బీ+జీ+3) నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.244.26 కోట్లుగా నిర్ణయించింది. విద్యుత్‌ సౌకర్యం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, శానిటరీ పనుల కోసం ఈ టెండర్లు పిలిచింది. బిడ్‌ల దాఖలుకు మే 5ను తుది గడువుగా నిర్ణయించింది. 

మే 11న ఆర్థిక బిడ్‌ తెరిచి.. ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కు మే 18న పనులు అప్పగించేలా షెడ్యూలు రూపొందించింది. జా­యింట్‌ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా) టెండర్లలో బిడ్‌ల దాఖలుకు అర్హత లేదని నిబంధన పెట్టింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ పనులను ఎవరికి అప్పగించాలన్నది ఇప్పటికే ఖరారైందని.. టెండర్లు నామమాత్రమేనని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement