
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పాలనలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా.. మహిళలు అని కూడా చూడకుండా.. టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. మహిళల జాకెట్లు చించేసి.. వారి పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అనుచరులు ప్రభాకర్, అంజన్ కుమార్ అధికార మదంతో రెచ్చిపోయారు. ఓ భూమికి సంబంధించిన వివాదంలో మహిళలు రేణుకమ్మ, జయలక్ష్మీపై విచక్షణారహితంగా దాడికి చేశారు. వారిపై భౌతికంగా దాడులు చేసి.. జాకెట్లు చించేసి కిరాతకంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా.. కొడవలి పట్టుకుని వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళలు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చ మంద బెదిరింపులు, అరాచకాలపై మండిపడుతున్నారు.
