శిలాఫలకాల ధ్వంసం | TDP Leaders Demolish YSR Statue: AP | Sakshi
Sakshi News home page

శిలాఫలకాల ధ్వంసం

Published Tue, Jun 25 2024 4:25 AM | Last Updated on Tue, Jun 25 2024 4:25 AM

TDP Leaders Demolish YSR Statue: AP

ద్విచక్ర వాహనం దహనం.. వైఎస్సార్‌ విగ్రహానికి టీడీపీ కండువా

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్య­కర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నా­రు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం రాత్రి, సోమ­వారం ధ్వంసం చేశారు. వాహనాల దహనం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.  

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో రూ.27 లక్షలతో నిరి్మంచిన పీఏసీఎస్‌ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయు­డు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. త్రిస­భ్య కమిటీ పేరుపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా చైర్మన్‌గా వ్యవహరించిన గంధం వెంకటరత్నం (షావుకారు) పేరు సైతం తొలగించారు. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీ­పేట మండలం కె.పెదపూడి గ్రామంలోని మండల ప్రజాపరిషత్‌ పాఠశాలలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఎంఈవో సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు గంటా రజనీప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మండపేట–ద్వారపూడి రహదారి పనులకు సంబంధించి స్థానిక తాపేశ్వరం రోడ్డులోని లాకులకు వెళ్లే దారిలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోను పూర్తిగా తొలగించారు. ఘటనాస్థలాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పరిశీలించారు. శిలాఫలకాల ధ్వంసం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వెంటనే స్పందించి, ఇటువంటి ఘటనలను నిలువరించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లేదారిలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు తెలిపే శిలాఫలకాన్ని తొలగించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.  

 పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం గ్రామంలో బత్తుల రాంబాబు ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రాంబాబు ద్విచక్రవాహనాన్ని ఇంటి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో పార్కింగ్‌ చేశారు. అర్ధరాత్రి దాటాక మంటలు రావటాన్ని గమనించిన స్థానికులు మంటల్ని ఆరి్పవేశారు. అప్పటికే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. రాంబాబు భార్య స్వాతి గ్రామంలో వలంటీరుగా పనిచేసింది. టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ద్విచక్రవాహనం దహనమైంది. ఘటనాస్థలాన్ని ఎస్‌.ఐ. పి.హజరత్తయ్య పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  

 ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కండువా వేశారు. టీడీపీ నాయకుల ఆగడాలు తార­స్థాయికి చేరాయని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి అవమానించారని వైఎస్సార్‌సీపీ మర్లపాడు గ్రామ అధ్యక్షుడు సింగమనేని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement