పార్వతీపురం మన్యం: పట్టణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సాలూరు మున్సిపల్ పీఠంపై ఆశలతోనే ఓ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ ఉన్నఫలంగా, ఏ హడావిడీ లేకుండా ఆలయంలో వివాహం చేసుకున్నాడు.
సాలూరు మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వుడు కావడం.. ఆ పీఠం తన కుటుంబానికే ఇస్తున్నారన్న హామీతోనే అప్పటికప్పుడు పెళ్లికి ఉపక్రమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికమో.. వాస్తవమో గానీ, ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.


