కళా ఓ డిక్టేటర్‌!

TDP Leader Balagumma Venkateswara Rao Audio On Kala Venkata Rao - Sakshi

ఎవరైనా అణిగిమణిగి ఉండాల్సిందే

టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిపై జి.సిగడాం నేత ధ్వజం

సర్పంచ్‌ అభ్యర్థిని నిలబెట్టలేదని సస్పెన్షన్‌ వేటు వేశారన్నంటున్న తెలుగు తమ్ముడు

ఆడియో విడుదల చేసిన టీడీపీ అసమ్మతి నేత 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘వారి బంధువులకు ఓ న్యాయం. మిగతా కార్యకర్తలకు ఔటర్‌ కులాల వారికి ఓ న్యాయం అన్నమాట. అంటే వారి చేతిలో ఉన్న చెంచాగాళ్లందరికీ ఓ రూల్‌ అన్నమాట. మిగతా వారందరికీ, అదర్‌ కమ్యూనిటీలు ఏమైనా ఉంటే అదో రూల్‌. ఇది ఓ డిక్టేటర్‌షిప్‌ రూలింగ్‌లో ఉందన్నమాట ఇక్కడ. కిందన కూర్చోవాల, చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల, ఉంగరాలు ఉండకూడదు, బుర్ర దువ్వుకోకూడదు ఇలాంటి రూల్స్‌ ఉన్నాయన్నమాట ఇక్కడ నాయకత్వంలో.. ఎచ్చెర్లకు సంబంధించి రూల్స్‌ అన్నీ ఇక్కడ పనిచేయవు.

పూర్వం బ్రిటీష్‌ వారి పరిపాలనలా ఉండాలన్నమాటిక్కడ. చూస్తే స్థానికులు కాదు. పోనీ స్థానికులైనా ఫరవాలేకపోను. మాకు ఎక్కడినుంచో వస్తారు నాయకులు, ఇక్కడ మమ్మల్ని బ్రిటీష్‌ వాళ్లు ఏలినట్లు ఏలుతారన్నమాట’’ ఇదీ టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావునుద్దేశించి జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన బాలగుమ్మ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో కూడిన ఆడియో ప్రస్తుతం టీడీపీ సర్కిల్‌లోనూ, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

కళా వెంకటరావుపై ఎచ్చెర్ల నేతలు ఒక్కొక్కరిగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే చౌదరి బాబ్జీ, కలిశెట్టి అప్పలనాయుడు తదితర నేతలు గుర్రుగా ఉన్నారు. చాపకింద నీరులా మిగతా కేడర్‌ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  

మొన్నటి సర్పంచ్‌ ఎన్నికల్లో జి.సిగడాం మండలం సంతవురిటిలో టీడీపీ మద్దతుదారుని బరిలోకి దించలేదని, ఆయన మరోపక్షంతో కుమ్మక్కయ్యారన్న కారణం చూపి ఆ గ్రామ, మండల నేతైన బాలగుమ్మ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేయించారు. దీని వెనుక కళాకు వ్యతిరేక స్వరమే కారణమైనప్పటికీ అవకాశం వచ్చిందని సర్పంచ్‌ ఎన్నికల ముసుగులో వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేశారన్న వాదనలు ఉన్నాయి.  

1982 నుంచి ఆస్తులు అమ్ముకుని అటు మండలం, ఇటు గ్రామంలోనూ తన తండ్రి దగ్గరి నుంచి టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న తమకు సస్పెన్షన్‌ బహుమతి ఇచ్చారని వెంకటేశ్వరరావు రగలిపోతున్నారు. కళా వెంకటరావు సొంత మండలమైన రేగిడిలో అనేక పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని, రేగిడి, వంగర మండలాల్లో ఏకంగా ఎంపీటీసీలే ఏకగ్రీవమైపోయి మండల పరిషత్‌ పీఠాలు వైఎస్సార్‌సీపీ పరమయ్యాయని, దానికి కళా బాధ్యులు కాదా? తనను సస్పెండ్‌ చేసినప్పుడు...ఆ రూల్‌ కళాకు వర్తించదా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అసలు సస్పెండ్‌ చేయడానికి కళా వెంకటరావు ఎవరని నేరుగా ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సస్పెండ్‌ చేయాలే తప్ప ఈయనెవరని ధిక్కార స్వరం వినిపించారు. నేరుగా తన వాయిస్‌ను రికార్డు చేసి వాట్సాప్‌ గ్రూపుల్లో వదిలారు. ఇప్పుడీ ఆడియో టీడీపీ సర్కిల్‌లోనూ, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.
చదవండి:
అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..!     
పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top