
చిత్తూరులో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలిపై టీడీపీ నాయకుడి బూతుపురాణం
సాక్షి, అమరావతి: అధికారం మత్తులో టీడీపీ నాయకులు సభ్యత, సంస్కారం, విచక్షణ కోల్పోయి మహిళలను బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు. తాజాగా చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షణ్ముగం అదే నగరానికి చెందిన వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలికి ఫోన్‌చేసి తీవ్రంగా దుర్భాషలాడాడు. పనికిమాలినదానా.. నీకు గంగజాతరే.. అంటూ హెచ్చరించారు. ఆయన మాట్లాడిన మాటలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం పర్యటనలో పాల్గొన్న వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
జైలులో ఉన్న వారిని శనివారం వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తదితరులు వెళ్లి పరామర్శించారు. దీనిపై టీడీపీ నాయకుడు షణ్ముగం విలేకరుల సమావేశం పెట్టి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఆరోపణలు చేశారు. అతని ఆరోపణలను వైఎస్సార్‌సీపీ వారు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అందులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు కూడా ఉన్నారు. ఆమె ఖండించడాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ నేత షణ్ముగం ఫోన్‌చేసి పత్రికలో రాయలేని పదజాలంతో దూషించాడు.
టీడీపీ నేత బూతుపురాణం ఇలా...
షణ్ముగం: హలో.. ఏంటీ విషయం..
మహిళా నాయకురాలు: మీరు చెప్పాలి.. మమ్మల్ని అడుగుతున్నారు.. ఏంటీ విషయమని..
షణ్ముగం: ఏమీ ఎక్కువ పెడుతున్నావ్..
ఏం కథా..
మహిళ: మీరు ఎక్కువ పెట్టలేదా? భయపడాలా ఎట్లా.. ప్రశి్నంచాం. ధైర్యముంటే సమాధానం చెప్పాలి. మీరెవ్వరూ మా నాయకులు (మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి) గురించి మాట్లాడడానికి?
షణ్ముగం: పత్రికలో రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు. నీవు ఎలాంటి పనికిమాలినదానివో. ఎందుకు కౌంటర్ ఇచ్చావ్.. లం.. ముండవు నువ్వు. నీది బ్రోకర్ బతుకే. లం..దానివి. నీ బతుకంతా టూటౌన్ సీఐ చెబుతున్నాడు. లం.. నీ.. ఫోన్ పెట్టవే. నిన్నేమైనా మీ నాయకుడు.. అంటూ రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు.
మహిళ: నువ్వు ఎన్ని మాట్లాడినా వెంట్రుక కూడా పీకలేవ్. నీవెంతా...నీ బతుకెంతా.
రెండో వాయిస్ రికార్డు
షణ్ముగం: హలో..(మర్యాదగా)
మహిళ: ఇంతసేపు ఎలా అలా మాట్లాడావ్.. నేను మిమ్మల్ని మీరు అని మాట్లాడాను. నన్ను ఎలా ఆ పదంతో మాట్లాడావ్.
షణ్ముగం: వాట్సాప్‌లో గ్రూప్ ఎందుకు కౌంటర్ మెసేజ్‌లు ఎందుకు పెడుతావ్.
మహిళ: టీడీపీలో నీకు సభ్యత్వం ఉందా. పార్టీలో నువ్వు ఉన్నావా. నువ్వు ఎందుకు మా నాయకుల పేరు ఎత్తుతావ్. మా నాయకుల దగ్గర డబ్బులు తీసుకోలేదా..? నీకేదైనా అయితే టీడీపీ వచ్చిందా? సంస్కారం అనేది మనిషిలో ఉండాలి. కూతురును పోగొట్టుకున్నావ్. ఇంకో ఆడబిడ్డ గురించి అలా ఎలా మాట్లాడుతావ్? నువ్వు నన్ను అంటే.. నేను నిన్ను అంటా. నువ్వు బూతులు మాట్లాడితే..నేను బూతులు మాట్లాడుతా.
షణ్ముగం: టీడీపీకి నేను లైఫ్ టైం మెంబర్‌ను. వాళ్ల గురించి వీళ్ల గురించి ఎలా మాట్లాడుతావ్.
మహిళ: అన్నీ కల్పించుకొని మాట్లాడొద్దు. మర్యాదగా సార్ అని వాట్సాప్‌లో సమాధానం ఇచ్చా. నీవు ఎలా ముండా.. ముండా.. అని రిప్‌లై ఇస్తావ్. వయస్సుకి మర్యాద ఇచ్చా. నిన్ను ప్రశ్నిస్తే ముండలా?
షణ్ముగం: నీకు చిత్తూరు గంగజాతరే...
మహిళ: చిత్తూరు గంగజాతరా కాదు. తిరునాళ్లు చేసుకో.. అంటుండగా షణ్ముగం ఫోన్ కట్ చేశాడు.