వైఎస్సార్‌సీపీ దళిత నేత ఇంటిపై దాడి | TDP Goons Attacks On YSRCP Leaders Erraballi Srinivas House In Chittoor, Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ దళిత నేత ఇంటిపై దాడి

Published Tue, Jun 25 2024 4:09 AM | Last Updated on Tue, Jun 25 2024 12:28 PM

TDP Goons Attacks On YSRCP Leaders Erraballi Srinivas House

ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడి విధ్వంసం 

ఆయన భార్య, కుమారుడికి గాయాలు 

చిత్తూరు జిల్లాలో ఘటన

టీడీపీ శ్రేణుల పనే! 

పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి  టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.

వైఎస్సార్‌సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్‌ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.

గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement