ఏలూరు: సాక్షి కార్యాలయంపై పెట్రోల్‌ బాటిళ్లతో పచ్చమూకల దాడి | Tdp Goons Attack On Eluru Sakshi Media Offices | Sakshi
Sakshi News home page

ఏలూరు: సాక్షి కార్యాలయంపై పెట్రోల్‌ బాటిళ్లతో పచ్చమూకల దాడి

Jun 10 2025 8:19 PM | Updated on Jun 10 2025 9:12 PM

Tdp Goons Attack On Eluru Sakshi Media Offices

సాక్షి,ఏలూరు:  తెలుగు ప్రజల మన సాక్షి.. సాక్షి కార్యాలయాలపై టీడీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల్ని డైవర్ట్‌ చేసేందుకు కూటమి ప్రభుత్వం సాక్షి కార్యాలయాలపై కుట్రకు దిగింది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల గూండాగిరికి దిగారు. సాక్షి కార్యాలయంపై దెందులూరు నియోజకవర్గ టీడీపీ నేతలు దాడి చేశారు. పెట్రోల్ బాటిళ్ళు ,రాళ్ళతో దాడి చేశారు. 

ఈ దాడిలో కార్యాలయంలో సోఫా సెట్లు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయింది. ఆఫీసు ఉద్యోగి కారు ధ్వంసమైంది. పెట్రోల్‌ బాటిళ్లతో దాడి కారణంగా సాక్షి కార్యాలయంలో గ్లౌండ్‌ ఫ్లోర్‌ తగలబడింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో కార్యాలయం సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎగిసి పడుతున్న మంటల్ని ఆపేందుకు ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాటిళ్లతో దాడులు చేస్తున్నా.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, గత, మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారు. 

Eluru Sakshi Office

Advertisement
 
Advertisement
Advertisement