Nov 16th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Case Petitions And Political Updates 16th November | Sakshi
Sakshi News home page

Nov 16th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Nov 16 2023 7:12 AM | Last Updated on Thu, Nov 16 2023 5:04 PM

TDP Chandrababu Case Petitions And Political Updates 16th November - Sakshi

Chandrababu Naidu Cases, Petitions, & Political Updates

04:55 PM, Nov 16, 2023
చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు
►స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
►సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు
►చంద్రబాబు తరపు వాదనలు వినిపించిన సిద్ధార్ధ్ లూథ్రా
►తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు

04:24 PM, Nov 16, 2023
చంద్రబాబువి తప్పుడు హెల్త్ రిపోర్డులు: ఏఏజీ
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు
►చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు
►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు
►చట్టం ముందు అందరూ సమానులే 
►ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి
►అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు
►కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది
►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు
►చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారు
►బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది
►బోస్‌, కన్వేల్కర్‌ మెస్సేజ్‌ల ఆధారంగా డబ్బు హైదరాబాద్‌కు చేరినట్లు తెలిసింది
►సీమెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు
►చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు
►చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారు

04:12 PM, Nov 16, 2023
స్కిల్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారిన సిమెన్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్‌ చంద్రకాంత్‌ షా
►షాను వచ్చే నెల 5వ తేదీన ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశం
►స్కిల్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారినట్లు ఏసీబీ కోర్టులో ఇప్పటికే  పిటిషన్ దాఖలు చేసిన A13గా ఉన్న  సిదీష్‌ చంద్రకాంత్‌ షా
►సిదీష్ చంద్ర కాంత్ షా దాఖలు చేసిన పిటిషన్‌ను నిన్న విచారించిన ఏసీబీ కోర్టు
►వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►స్కిల్ స్కాం కేసులో ఇప్పటికే మొత్తం 37 మందిని నిందితులుగా చేర్చిన సీఐడీ

04:10 PM, Nov 16, 2023
హైదరాబాద్‌: చంద్రబాబును కలిసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు
►చంద్రబాబు తో చర్చలు జరిపిన రఘురామకృష్ణరాజు 
►టీడీపీ తరపున తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న రఘురామ

02:57 PM, Nov 16, 2023
స్కిల్‌ స్కాం కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
►సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

02:48 PM, Nov 16, 2023
చంద్రబాబు మెడికల్‌ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి: సజ్జల రామకృష్ణారెడ్డి
►జైలులో ఉన్నంతసేపు ప్రాణాంతక వ్యాధులున్నట్టు ప్రచారం చేశారు
►బెయిల్ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారు
►చంద్రబాబు మెడికల్ రిపోర్టుపై ఎల్లోమీడియా హడావుడి చేస్తోంది
►అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు
►కోర్టు అనుమతిస్తే బెయిల్ వస్తుంది
►ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చింది
►ఇప్పుడు ఆ బెయిల్ పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు
►ఏఐజీలో ఉన్నది వైద్యులా లేక రాజకీయ నేతలా?
►చంద్రబాబుకు నిజంగా ఆ పరిస్ధితి ఉంటే వెంటనే ట్రీట్ మెంట్ ఇవ్వాలి
►డాక్టర్ల నుంచి అలాంటి రిపోర్ట్ తెచ్చుకోవడం చంద్రబాబు చాకచక్యంలా కనిపిస్తోంది
►మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా?
►చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా మాకేం ఇబ్బంది లేదు
►ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందన్న విషయం పక్కకి పోతోంది
►చంద్రబాబు తరపు లాయర్లు కూడా స్కాంపై వాదించడం లేదు
►ఈస్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారు

11:30 AM, Nov 16, 2023
టీడీపీ-జనసేన సమన్వయంలో గందరగోళం
►దిగువ స్థాయి నేతల మధ్య కుదరని రాజీ
►నియోజకవర్గాల్లో బయటపడుతున్న విభేదాలు
►పిఠాపురం సమావేశంలో ఫైటింగ్ సీన్
►అనకాపల్లి, అమలాపురంలోనూ ఘర్షణలు
►నందిగామ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్.
►పొత్తుపై ఎదురు తిరుగుతున్న జనసైనికులు.

10:50 AM, Nov 16, 2023
పురంధేశ్వరీ.. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా?
►బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయి కౌంటర్‌
►ఏపీలో ఓ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన సీఎం జగన్‌ను తిట్టడమే మీ పని. 
►మీ నాన్నకు వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పని ఏమంటారు?. 
►దయచేసి చెప్పగలారా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? .

10:30 AM, Nov 16, 2023
ఎల్లో బ్యాచ్‌ దొంగ హామీలతో తస్మాత్‌ జాగ్రత్త!
►టీడీపీ, జనసేన ఇద్దరూ తోడు దొంగలు
►600 దొంగ హామీలు ఇచ్చి, 6 లక్షల కోట్లకుపైగా ప్రజాధనాన్ని దోచేసిన తోడు దొంగలు. 
►మళ్లీ ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఏపీని దోచుకోవడానికి వస్తున్నారు. 
►ప్రజలందరూ తస్మాత్‌ జాగ్రత్త!

10:20 AM, Nov 16, 2023
జనసేన నేతల మధ్య తన్నులాట..
►అనకాపల్లిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
►ఈ సమావేశం సందర్భంగా జనసేన నాయకుల మధ్య తన్నులాట
►జనసైనికులకు నోటీసులు జారీ.
►తన్నులాటపై మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం. 

10:15 AM, Nov 16, 2023

టీడీపీ, జనసేనకు మంత్రి అమర్నాథ్‌ కౌంటర్‌
►ప్రతిపక్ష నేతలకు మంత్రి అమర్నాథ్‌ కౌంటర్‌
►చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను నాదెండ్ల భాస్కర్‌ చదువుతున్నారు. 
►చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్‌ చిన్న కట్టప్ప
►పవన్‌తో పాటు, నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. 
►ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్‌ కల్యాణ్‌కు మనోహర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారు. 

10:05 AM, Nov 16, 2023
స్కిల్‌ స్కాంలో విరాళాలు 100 కోట్లపైనే..
►స్కిల్‌ స్కాంలో టీడీపీ అకౌంట్‌లోకి వెళ్లినవి రూ.27కోట్లు కాదు. 
►విరాళాల రూపంలో టీడీపీ అకౌంట్‌లోకి వెళ్లినవి దాదాపు రూ.100కోట్లపైనే.. 

10:00 AM, Nov 16, 2023
డ్రామా కింగ్‌ చంద్రబాబు..
►అనారోగ్యం అంటూ డ్రామాలతో జైలు నుంచి బయటకు..
►రాత్రిళ్లు నిద్రపోకుండా 14 గంటలు కారులో కూర్చుని ప్రయాణం
►అరెస్ట్‌కు ముందు రోజంతా బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. 
►వయసు నాకు నంబర్‌ కాదంటూ వ్యాఖ్యలు
►బెయిల్‌ కోసం మాత్రం 14 రకాల జబ్బులు ఉన్నాయని డ్రామాలు. 
►చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఊరికే అన్నారా..


 

9:00 AM, Nov 16, 2023
ఏపీ ఎడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నరసింహశర్మ
►ఏపీ హైకోర్టు ఎడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నరసింహశర్మ
►ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 
►ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఏఎస్జీగా ఉన్న నరసింహశర్మ
►ఏపీ హైకోర్టులో రెగ్యులర్ ఏఎస్జీని నియమించే వరకు బాధ్యతల్లో కొనసాగనున్న నరసింహ శర్మ

8:55 AM, Nov 16, 2023
స్కిల్ కేసులో బాబు పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ 
►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారించనున్న హైకోర్టు
►వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు, సీఐడీ లాయర్లు 

8:10 AM, Nov 16, 2023
పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్‌
►తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని సలహా ఇచ్చింది మీరే కదా పురంధేశ్వరి!
►మీ ఆస్తులు, నివాసాల కోసం కాంగ్రెస్‌ను గెలిపించుకుంటున్నారా?.
►రాజకీయంగా ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా!
►బీజేపీ గురించి కాకుండా సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నారు.

8:05 AM, Nov 16, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
►సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
►షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
►నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
►సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
►రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 


8:00 AM, Nov 16, 2023
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత
►మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలకు చంద్రబాబు, పవన్ అంగీకారం
►11 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపకల్పన.
►నేడు మినీ మేనిఫెస్టోకు ఆమోదముద్ర.
►ఈనెల 18, 19న ఉమ్మడి ఆందోళనలు

7:00 AM, Nov 16, 2023
ఏపీ హైకోర్టుకు చంద్రబాబు హెల్త్‌ రిపోర్టు..
►చంద్రబాబు హెల్త్ రిపోర్ట్‌ను ఏపీ హైకోర్టుకు అందజేసిన ఆయన లాయర్లు
►చంద్రబాబు గుండె పరిమాణం పెరిగింది.
►బ్లాక్స్ ఉండడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తక్కువగా ఉందన్న న్యాయవాదులు
►గుండె వాల్వ్‌లలో ఇబ్బందులు ఉన్నాయి: బాబు లాయర్ల 

6:55 AM, Nov 16, 2023
రాజధానికి భూమలిచ్చిన కేసుపై తీర్పు రిజర్వ్‌
►రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కేసు, హైకోర్టులో పిటిషన్
►పిటిషన్ వేసిన అమరావతి రాజధాని రైతు సమాఖ్య రాజధాని రైతు పరిరక్షణ సమితి
►ఇరుపక్షాల తరపున పూర్తయిన వాదనలు 
►తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయమూర్తి 
►అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్న న్యాయమూర్తి 

6:50 AM, Nov 16, 2023
►నేడు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►నేడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ 

6:45 AM, Nov 16, 2023
నేడు కొల్లు రవీంద్ర పిటిషన్‌పై విచారణ
►మద్యం కేసులో కొల్లు రవీంద్ర పిటిషన్‌పై నేడు విచారణ 
►కొల్లు రవీంద్ర పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ 
►మద్యం కేసులో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌
►మద్యం కంపెనీలకు చట్టవిరుద్ధంగా అనుమతి ఇచ్చారంటూ కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు 

6:40 AM, Nov 16, 2023
స్కిల్ స్కాం కేసు విచారణ నేటికి వాయిదా
►స్కిల్‌ స్కాం కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
►విచారణ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు 
►మిగిలిన వాదనలు నేడు వింటామన్న ఏపీ హైకోర్టు 

6:35 AM, Nov 16, 2023
నేడు ఏపీ హైకోర్టులో స్కిల్ కేసుపై విచారణ
►స్కిల్‌ కేసులో యోగేష్ గుప్తా ముందస్తు బెయిల్‌పై విచారణ 
►స్కిల్ కేసులో మనీలాండరింగ్‌లో కీలకంగా ఉన్న గుప్తా 
►బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేసిన సీఐడీ అధికారులు 
►స్కిల్ కేసులో ఏ22గా ఉన్న యోగేష్ గుప్తా 
►IRR, ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా గుప్తా పేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement