స్వర్ణ ప్యాలెస్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

Swarna Palace Incident: Govt Hands Over Ex Gratia To Victims Family - Sakshi

సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. 
(చదవండి: పుట్టెడు దుఃఖంలో ఉన్నా లంచం తప్పలేదు)


వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు 6 చెక్కులు ఇవ్వడం జరిగింది. సాయంత్రం ముగ్గురికి మచిలీపట్నంలో చెక్కులు అందిస్తాం. మరొకరు గర్భిణీ కావడంతో కలెక్టర్‌ వారి ఇంటికి వెళ్లి చెక్కు అందజేస్తారు. నాణ్యతా, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తప్పవు. రమేష్ హాస్పిటల్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని నోటీస్ జారీ చేశాము. ఆ ఆస్పత్రిలో అధిక ఫీజుల వసూలు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురుని అరెస్ట్ చేశాం’అని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు కరోనా బారిన పడుతున్న జర్నలిస్టుల సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్ల నాని తెలిపారు.
(చదవండి: రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top