
( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేయబడింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవనున్నారు.
అయితే, అవినీతి ఆరోపణలపై గతంలో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరునున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరి డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నేడు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు.