గుట్టు తేల్చనున్న సీరో సర్వైలెన్స్‌ 

Survey on the growth of corona antibodies - Sakshi

కరోనా యాంటీబాడీస్‌ వృద్ధిపై సర్వే 

వైరస్‌ సోకినా ఎక్కువ మంది కోలుకునే అవకాశం 

ఢిల్లీలో 23 శాతం మంది ఇలా కోలుకున్నట్లు వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వైరస్‌ పరిస్థితులను అంచనా వేసేందుకు నిర్వహించనున్న సీరో సర్వైలెన్స్‌ ద్వారా మహమ్మారి ఉధృతం, విస్తరణ వంటివి తెలియనున్నాయి. ఇప్పటికే.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా.. అధిక శాతం జనాభాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అద్భుతంగా యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందినట్లు వెల్లడైంది. ఢిల్లీలో అయితే 23 శాతం మందికి వైరస్‌ సోకి తమకు తెలియకుండానే కోలుకున్నారు. అక్కడ లక్షన్నర పాజిటివ్‌ కేసులు నమోదు అయినప్పుడు ఈ సర్వే నిర్వహించారు. ప్రాంతాల వారీగా కొన్ని శాంపిళ్లు నిర్వహించి వారిలో ఎంతమేరకు యాంటీబాడీస్‌ అభివృద్ది చెందాయి అన్నది తేల్చారు. దీనివల్ల వైరస్‌ గమనం ఎలా ఉందో తెలిసింది. ఇక ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా పలు విషయాలు తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

► ఉభయగోదావరి జిల్లాలు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సర్వే నిర్వహిస్తారు. 
► ఒక్కో జిల్లాలో 3,700 శాంపిళ్లను సేకరించి వారిలో యాంటీబాడీస్‌ వృద్ధిని పరిశీలిస్తారు. 
► ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని కేటగిరీలుగా విభజించి నమూనాలు సేకరిస్తారు. 
► ఈ 4 జిల్లాల్లో పూర్తయిన తర్వాత మిగతా జిల్లాల్లో నమూనాల సేకరణ ఉంటుంది. 
► ఈ సర్వేతో వైరస్‌ ప్రభావంతో పాటు, అది ఎంతమందికి సోకిందీ, దానివల్ల యాంటీబాడీస్‌ వృద్ధి ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. 
► ఎక్కువ మందిలో యాంటీబాడీస్‌ వృద్ధి చెంది ఉంటే గనుక వారికి తెలియకుండానే కరోనా సోకి నయమైనట్టు పరిగణించవచ్చు. 
► ఇలాంటి సర్వైలెన్స్‌ ఆధారంగా భవిష్యత్‌లో ఏ ప్రాంతంలో టెస్టులు చేయవచ్చు, ఎవరికి అవసరం అన్న విషయాలపై ఒక అంచనాకు రావచ్చు.  
► తాజా పరిస్థితుల నేపథ్యంలో రోజూ సగటున 10 వేల కేసులతో వైరస్‌ స్థిరంగా ఉన్నట్టు అంచనా వేశారు 
► నాలుగు జిల్లాల్లో ఈనెలాఖరుకు లేదా సెప్టెంబర్‌కు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-01-2021
Jan 17, 2021, 05:34 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి...
17-01-2021
Jan 17, 2021, 05:22 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది...
17-01-2021
Jan 17, 2021, 05:04 IST
ఓస్లో: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి...
17-01-2021
Jan 17, 2021, 04:56 IST
భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం...
17-01-2021
Jan 17, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు...
16-01-2021
Jan 16, 2021, 19:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. నేడు మొత్తంగా 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌...
16-01-2021
Jan 16, 2021, 17:00 IST
హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని భారత్‌ బయోటెక్‌  ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌...
16-01-2021
Jan 16, 2021, 16:52 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు చేయగా 114 మందికి...
16-01-2021
Jan 16, 2021, 14:21 IST
వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణలో ఇదొక మైలురాయి వంటిది. భారతీయుల కోసం ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు ఈ నెలలోనే...
16-01-2021
Jan 16, 2021, 13:04 IST
అతి త‌క్కువ జీవిత‌కాలం ఉన్న‌వారు టీకా తీసుకోవడం వల్ల పెద్ద‌గా ప్రయోజనం ఉండ‌దు
16-01-2021
Jan 16, 2021, 12:19 IST
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
16-01-2021
Jan 16, 2021, 10:48 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10:30...
16-01-2021
Jan 16, 2021, 08:33 IST
దాదాపు 11 నెలలుగా పట్టి పీడించి.. మనుషుల జీవన గతినే మార్చేసి.. బంధాలు.. అనుబంధాలను దూరం చేసి.. ఆర్థిక రంగాన్ని కుంగదీసి.. ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసి.. అన్ని...
16-01-2021
Jan 16, 2021, 08:13 IST
సాక్షి, రంగారెడ్డి: దాదాపు పది నెలలుగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి విముక్తి లభించనుంది. జిల్లాలో శనివారం కరోనా...
16-01-2021
Jan 16, 2021, 04:18 IST
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్‌ మహమ్మారిని...
15-01-2021
Jan 15, 2021, 17:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం ఏమీ లేదని, సంసిద్ధంగా ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య...
15-01-2021
Jan 15, 2021, 17:43 IST
హైదరాబాద్‌: రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రేపు తెలంగాణలోని 139 కేంద్రాల్లో...
15-01-2021
Jan 15, 2021, 15:32 IST
విజయవాడ: ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. వర్చువల్‌ పద్ధతిలో ప్రధాని...
15-01-2021
Jan 15, 2021, 15:24 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,696 మందికి కరోనా పరీక్షలు చేయగా 94 మందికి...
15-01-2021
Jan 15, 2021, 12:18 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top