2 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంటు–1 పరీక్షలు | Sakshi
Sakshi News home page

2 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంటు–1 పరీక్షలు

Published Fri, Dec 23 2022 4:49 AM

Summative Assessment Examinations For School Students In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు జనవరి 2వ తేదీ నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంటు–1 పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి గురువారం షెడ్యూల్‌ విడుదల చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ–1 పరీక్షలు జరుగుతాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్షల షెడ్యూల్‌ ఇలా.. 

1 నుంచి 5 తరగతుల విద్యార్థులు : 
ఎలిమెంటరీ తరగతులకు (1–5) చెందిన విద్యార్థులకు 4వ తేదీ నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఎలిమెంటరీలోని అన్ని తరగతులకు 4న ఫస్ట్‌ లాంగ్వేజ్, 5న ఇంగ్లిషు, 6న మేథమెటిక్స్‌ పరీక్షలుంటాయి. ఇక 7వ తేదీన 3, 4, 5 తరగతుల వారికి ఎన్విరాన్మెంటల్‌ సైన్సు పరీక్షలుంటాయి.

6 నుంచి 10 తరగతుల విద్యార్థులు: 
ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంటు–1 పరీక్షలు  2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 వరకు 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 వరకు 7, 9 తరగతులకు పరీక్షలు జరుగుతాయి.  

6–10 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ ఇలా 
► జనవరి 2న 6, 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్‌–1 పరీక్ష ఉంటుంది. 7, 9 తరగతులకు కాంపోజిట్‌ కోర్సు సంస్కృతం, హిందీ, అరబిక్‌ పర్షియా పేపర్‌–1 పరీక్ష  
► జనవరి 3న 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్‌–2 పరీక్ష, మధ్యాహ్నం 9వ తరగతికి కాంపోజిట్‌ కోర్సు పేపర్‌–2 పరీక్ష  
► జనవరి 4న ఉదయం, మధ్యాహ్నం 6 నుంచి 10 తరగతులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష  
► జనవరి 5న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష  
► జనవరి 6న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష  
► జనవరి 7న 6, 7, 9, 10 తరగతులకు మేథమెటిక్స్, 8వ తరగతికి సోషల్‌ స్టడీస్‌ పరీక్ష  
► జనవరి 9న 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు జనరల్‌ సైన్సు పరీక్ష  
► జనవరి 10న 6, 7, 9, 10 తరగతులకు సోషల్‌ స్టడీస్‌ పరీక్ష, 8వ తరగతి విద్యార్థులకు మేథమెటిక్స్‌ పరీక్ష  
► 8వ తరగతి జనరల్‌ సైన్సు, మేథమెటిక్స్‌ పరీక్ష పత్రాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు వేర్వేరుగా ఉంటాయి. 

Advertisement
Advertisement