సెప్టెంబ‌రు 19 నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

Srivari Salakatla Brahmotsavam Starts From September 19th - Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి‌ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్-19 కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి. చదవండి: (కాగ్‌ ద్వారా టీటీడీ ఆడిటింగ్‌..!)

బ్ర‌హ్మోత్స‌వాల్లో రోజువారీ వివరాలు ఇలా వున్నాయి‌...

  • 18-09-2020: అంకురార్పణం (సాయంత్రం)
  • 19-09-2020: ధ్వజారోహణం (సాయంత్రం)
  • 19-09-2020: పెద్దశేషవాహనం (రాత్రి)
  • 20-09-2020: చిన్నశేషవాహనం (ఉదయం), హంస వాహనం (రాత్రి)
  • 21-09-2020: సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం (రాత్రి)
  • 22-09-2020: కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహన (రాత్రి)
  • 23-09-2020: మోహినీ అవతారం (ఉదయం), గరుడ సేవ (రాత్రి)
  • 24-09-2020: హనుమంత వాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గజవాహనం (రాత్రి)
  • 25-09-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి)
  • 26-09-2020: శ్రీవారి రథోత్సవం (ఉదయం), అశ్వవాహనం (రాత్రి)
  • 27-09-2020: చక్రస్నానం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి)
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top