మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి | Srikalahasti MLA Madhusudhan Reddy helps for Student Education | Sakshi
Sakshi News home page

మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

Aug 18 2022 3:32 PM | Updated on Aug 18 2022 3:40 PM

Srikalahasti MLA Madhusudhan Reddy helps for Student Education - Sakshi

విద్యార్థిని తల్లికి డబ్బు అందజేస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

సాక్షి, శ్రీకాళహస్తి: విద్యార్థిని చదువు మధ్యలో ఆగిపోకుండా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.50 వేలు సాయం చేసి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తొట్టంబేడు మండలం రాంబట్లపల్లెకు చెందిన సుధాకర్‌నాయుడు, విజయ దంపతుల కుమార్తె జ్యోత్స్న మదనపల్లెలో ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. వారిది పేద కుటుంబం కావడంతో చదువుకు ఇబ్బంది కలిగింది.

వారు బుధవారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని కలిసి తమ గోడును వినిపించారు. స్పందించిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా విద్యార్థినికి ల్యాప్‌ట్యాప్‌ను ఈ నెల 20వ తేదీన తీసిస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో చదువు ఆగిపోకుండా సాయం అందిస్తానని వెల్లడించారు. దీంతో సుధాకర్‌నాయుడు దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.   

చదవండి: (భార్య సివిల్స్‌ పోరాటం..భర్తలో అనుమానం)   

Advertisement
 
Advertisement
Advertisement